Monday, December 23, 2024

స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 అవార్డులకు పోటీపడేందుకు జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 అవార్డులకు పోటిపడేందుకు జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మ ంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లాలోని డిఆర్డిఎ, డిపిఓ, ఎంపిడిఓ, ఎంపిఓ, ఎపిఓ, పలు పంచాయతీ సెక్రటరీలతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీ ఏ పిడి చంద్రమోహన్ రెడ్డి స్వచ్చ సర్వేక్షణ్ గ్రా మీణ్ 2023 ప్రత్యక్ష పరిశీలన పలు అంశాలు వా టికి కేటాయించిన మార్కుల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలా ల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 డిల్లీ బృందం ప్రతి గ్రామానికి ప్రత్యక్ష పరిశీలకై రానందున ఎ క్కడ ఎలాంటి పోరపోట్లు జరగకుండా గ్రామాల్లో నిర్వహించాల్సిన విధులను నిబద్ధతతో చేయాలన్నారు.

గ్రామాల్లో మరుగుదొడ్డు, ఇంకుడు గుంతలు, తడిపోడి చెత్త సేకరణ లాంటి ఇతర అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలి. మహిళా సంఘాలతో ఎస్‌ఎచ్‌జిల సహకారంతో గ్రామాల్లో విసృతంగా ప్రచారం చేయాలి. గ్రౌండ్ లెవెల్‌లో ప్రతిధి చెక్ చేసుకోవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 పలు అంశాల గుర్చి క్షేత్ర స్థాయిలో ఎదుర్కోవాల్సిన చర్యలు తెలిపాలన్నారు. అందరు అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ దేవకిదేవి, జడ్పీ సిఈఓ రమేశ్, అదనపు డిఆర్డిఏ పిడి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News