Sunday, December 22, 2024

ప్రజలు సౌఖ్యంగా జీవించేలా సమయ పరిమితి లక్ష్యాలు

- Advertisement -
- Advertisement -

Every village should be provided with digital facility:Modi

సేవలు, సౌకర్యాలు సామాన్య ప్రజలకు నూటికి నూరుపాళ్లు అందాలి
ఆశావహ జిల్లాల అభివృద్ది పథకంపై సమీక్ష
పథకంలో తెలంగాణలో భూపాల పల్లి, ఆసిఫాబాద్ , ఖమ్మం తదితర జిల్లాలు
ప్రతి జిల్లాకు రెండేళ్ల విజన్‌తో లక్షాలపై సూచన
ప్రతి గ్రామానికి డిజిటల్ సౌకర్యం అందించాలి
వర్చువల్ సమావేశంలో జిల్లాల కలెక్టర్లకు ప్రధాని మోడీ సూచన

న్యూఢిల్లీ : ప్రజలు సౌఖ్యంగా జీవించేలా నూటికి నూరు పాళ్లు వారికి సంతృప్తికరంగా సేవలు , సౌకర్యాలు అందేలా సమయ పరిమితితో లక్షాలను రూపొందించుకుని పనిచేయాలని అదే యావత్ దేశ లక్షంగా భావించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రధాని మోడీ శనివారం సూచించారు. పైస్థాయి నుంచి కిందివరకు అలాగే కిందిస్థాయి నుంచి పైవరకు ప్రజలకు, పాలనాయంత్రాంగానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లతోపాటు కొంతమంది ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక పాలనా యంత్రాంగాల మధ్య టీమ్‌వర్కుతో ఆశావహ జిల్లాల్లో సత్ఫలితాలు వస్తున్నాయని ఉదహరించారు. ఈ ఆశావహ జిల్లాలు మరింత పురోగతి సాధించాలంటే ప్రజలు, పాలనా యంత్రాంగాల మధ్య ప్రత్యక్ష సంబంధాలు మరింత మెరుగుపడాలని హితవు పలికారు. సాంకేతికత, నవ కల్పనల ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న ఇబ్బందులను పరిష్కరించడం ద్వారా ఎలాంటి ప్రగతి సాధించవచ్చునో ఆశావహ జిల్లాలు నిరూపించాయని తెలిపారు.

దేశ వ్యాప్తంగా వెనుకబడిన 112 జిల్లాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2018 లో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆశావహ జిల్లాల అభివృద్ది పథకం ( ట్రాన్సఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ స్కీమ్ ) అని దీనికి పేరు పెట్టింది. తెలంగాణ నుంచి భూపాల పల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం, తదితర వెనుకబడిన జిల్లాలు ఈ పథకంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్టణం, కడప తదితర జిల్లాలు ఉన్నాయి. మోడీ ఈ సందర్భంగా ప్రతి జిల్లాకు రెండేళ్ల విజన్ నిర్ణయించారు. ప్రతి జిల్లా వచ్చే మూడు నెలల్లో 10 లక్షాలను నిర్దేశించుకుని సామాన్య ప్రజలు సౌఖ్యంగా ఉండేలా సేవలను సంతృప్తికరంగా అందించాలని సూచించారు.

డిజిటల్ ఇండియా రూపంలో దేశంలో నిశ్శబ్ద విప్లవం సాగుతోందని, దీని నుంచి ఏ జిల్లా మినహాయింపు కారాదని సూచించారు. ప్రతి గ్రామానికి డిజిటల్ సౌకర్యం విస్తరించేలా చూడాలని, ప్రతి ఇంటికి ఈ విధంగా సేవలు అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల మధ్య రెగ్యులర్‌గా సంబంధాలు ఉండేలా సాధనాన్ని రూపొందించాలని నీతి ఆయోగ్‌కు సూచించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ ఆశావహ జిల్లాల మొత్తం పురోగతి, అమలు విధానాలను సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News