Wednesday, December 25, 2024

ప్రతి కార్మికుడు రక్షణ చర్యలు

- Advertisement -
- Advertisement -

కాసిపేట: ప్రతి కార్మికుడు రక్షణ చర్యలు పాటించాలని, అండర్ గ్రౌండ్ గనులలో ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాలని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టి జిఎం గుప్తా అన్నారు. మంగళవారం కాసిపేట రెండు గనిపై పర్యవేక్షకులు అమలు పరుచు వారి యోక్క పాత్రపై అవగాహాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా కార్మికులను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమన్యాం ఆదేశాల మేరకు కాసిపేట గనిపై రక్షణ పై అవగాహాన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్మికులు రక్షణ విషయంలో ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు. సేఫ్టి మేనేజ్‌మెంట్, సేఫ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ పై పూర్తి అవగాహాన కలిగి ఉన్నప్పడే ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు.

ప్రతి కార్మికుడు నా రక్షణ నాదే భాద్యత నుండి నా రక్షణ నా కుటుంబ భాద్యతగా మనకు మనమే సతహాగా రక్షణ పొందాలని ఆయన అన్నారు. రక్షణ విదానాలను తెలుసుకునేందుకు సంస్థ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరుగుందన్నారు. గని మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుచు కాసిపేట రెండు గనిలో చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకొని ప్రణాళిక బద్దంగా పని చేస్తు జీరో ప్రమాదరహిత గనిగా మార్చగల భాద్యత అందరిపై ఉందన్నారు.

ఎ. బి. సి.డి సూత్రాలను పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యాక్రమంలో కెకె గ్రుఫ్ ఎజెంట్ రాందాస్,గని మేనేజర్ లక్ష్మీనారాయణతో పాటు రక్షణ అధికారి సంతోష్‌రావ్, ఇంజనీర్లు భీంరెడ్డి రఘు, నందకిషోర్, సర్వేయర్ ప్రకాషరావ్, సంక్షేమాదికారి భార్గవ్, టిబిజికెఎస్ నాయకులు కారూకూరి తిరుపతి, ఎఐటియుసి నాయకులు గొల్ల శ్రీనివాస్ మైన్స్ కమిటి, సేఫ్టి కమిటి సభ్యులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News