- Advertisement -
ప్రతి ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో
నిర్వహించాలని నిర్ణయం
మన తెలంగాణ /హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రెటరీ బి. వెంకటేశం శనివారం జారీచేశారు. గతంలో ఏడాదికి ఒక సారి మాత్రమే టెట్ నిర్వహించాలన్ననిబంధనను, ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని మార్చా రు. ఏడాదికి ఒకసారి నిబంధన కూడా అమలు జరిగేది కాదు. డిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో మాత్రమే టెట్ నిర్వహణ జరిగేది. టీచర్ ఎలిజిబిలిటీ కోసం జరిగే ఈ పరీక్షల్లో అర్హత సా ధించిన వారికి గతంలో డిఎస్‌సిలో కూడా వెయిటేజీ ఇచ్చారు. కాగా ఇక నుంచి జూన్, డిసెంబ ర్ నెలలో ఈ టెట్ పరిక్షను నిర్వహించనున్నారు.
- Advertisement -