Thursday, January 23, 2025

జమిలితో అందరికీ ప్రయోజనమే: రాంనాథ్ కోవింద్

- Advertisement -
- Advertisement -

జమిలితో అందరికీ ప్రయోజనమే
అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు ఇవ్వాలి
మాజీ ష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 
రాయ్‌బరేలి: జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. దేశానికి మేలు చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కోవింద్ విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు ఆయన మద్దతు పలికారు. ఏ పార్టీకయినా వీటివల్ల ప్రయోజనమేనని అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి కోవింద్ చైర్మన్‌గా వ్యశమరిస్తున్న విషయం తెలిసిందే.‘ ఒకే దేశంఒకే ఎన్నికపై అధ్యయనానికి కేంద్రం కమిటీని నియమించి దానికి నన్ను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీ జమిలి ఎన్నికలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నిటితో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నాం. ఏదో ఒక సమయంలో అన్ని పార్టీలు కూడా జమిలి ఎన్నికలకు మద్దతు పలికాయి. ఇది దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశం. దేశ ప్రయోజనాల కోసం అన్నిరాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. జమిలి ఎన్నికల ద్వారా ఆదా అయ్యే సొమ్మును అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేయవచ్చు.దానివల్ల అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుంది’ అని కోవింద్ చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై అధ్యయనానికి కేంద్ర పభుత్వం గత సెప్టెంబర్‌లో కమిటీని నియమించింది.

దీనికి రాంనాథ్ కోవింద్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే,మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీశ్ చంద్రలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను, ఇతర సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News