Monday, December 23, 2024

పట్టుదల చూస్తే ప్రతి ఒక్కరూ పోలీస్ ఉద్యోగాన్ని పొందుతారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్ధిపేట: ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న అభ్యర్థుల పట్టుదల చూస్తే ప్రతి ఒక్కరూ పోలీసు ఉద్యోగాన్ని పొందుతారనే నమ్మకం కలిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా గ్రౌండ్ కు వచ్చి మిమ్మల్ని చూసినప్పుడు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, పిఇటిల ద్వారా అందిన సమాచారం మేరకు ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం సాధించాలని, కఠోర శ్రమతో తపనతో శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  దేశ రాజధాని డిల్లీ నుంచి సిద్ధిపేట గ్రౌండ్ లో దేహా ధారుడ్య శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులు, పోలీసు అధికారులు, నిర్వాహకులు, పోలీసు కమిషనర్ శ్వేత, ఇతర పోలీసు అధికారులు మొత్తం 510 మందితో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు రెండు నెలలుగా దేహ ధారుడ్య శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులను ఉద్దేశించి సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత మాట్లాడారు.

పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ పొందిన వారిలో 60 శాతం మంది ఇతర జిల్లాలో సైతం లేనంత ఎక్కువ మంది సిద్ధిపేట జిల్లాలో క్వాలిఫై అయ్యారని హరీశ్ రావు తెలిపారు. ఫిజికల్ ఫిట్ నెస్ అనేది కంటిన్యూ ప్రాసెస్ అని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు వివరించారు. పారదర్శకంగా పరీక్షలు జరుగుతున్నాయని ఉద్యోగార్థులు ఏలాంటి అపోహలు పెట్టుకోవద్దని, మిమ్మల్ని మీ ప్రతిభనే నమ్మాలని సూచించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రెండు నెలలుగా దేహ ధారుడ్య శిక్షణ పొందుతున్నారని, సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత ప్రత్యేక శ్రద్ధ వహించి శిక్షణ పై వాకబు చేసి ఉత్సాహాన్ని నమ్మకాన్ని పెంచారని అభినందించారు. ఉదయాన్నే ఫిజికల్ టెస్ట్ కోసం వస్తున్న పోలీసు ఉద్యోగార్థుల కోసమై పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, అరటి పండ్లు పంపిణీ చేసి, మీలో శక్తి నింపే ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని ఉత్సాహాపరుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

గతంలో మన ప్రాంత ఉద్యోగార్థులు హైదరాబాదు, సంగారెడ్డి, కరీంనగర్ కు ఉదయమే కొత్త ప్రదేశాలకు వెళ్లి వ్యయప్రయాసలకు, శారీరకంగా, మానసికంగా బాధకు ఒత్తిడికి గురయ్యేవారని, దీన్ని గమనించి ప్రత్యేక శ్రద్ధతో పాత ఉమ్మడి జిల్లా కేంద్రం కాకుండా కొత్త జిల్లా కేంద్రంలో ఫిజికల్ టెస్ట్ సిద్ధిపేటలోనే జరిగేలా చేసుకోవడం, ఇక్కడి ప్రాంత వాసులకు మేలు జరగాలని సిద్ధిపేట పరేడ్ గ్రౌండ్ లోనే ఈ ఫిజికల్ టెస్ట్ నిర్వహించడం మంచి శుభపరిణామమని ఉద్యోగార్థులకు హరీశ్ రావు వివరించారు. శిక్షణకు సైతం హైదరాబాదు వెళ్లి సుమారు 30 వేలు ఖర్చు కాకుండా సిద్ధిపేటలోనే అభ్యర్థులకు చక్కటి శిక్షణ ఇప్పించామని తెలిపారు. దాదాపు 500 మంది ఈ శిక్షణ పొందుతున్నారని, చక్కటి శిక్షణ ఇచ్చిన పిఇటి టీచర్లను ప్రత్యేకించి మంత్రి అభినందించారు. మీ కఠోర శ్రమకు హ్యాట్సాఫ్ చెబుతూ.. ఇదే పంథాలో.. పట్టుదలతో పోలీసు కొలువు సాధించాలని, మీ ఆత్మవిశ్వాసం అంతా మీరు కొలువు సాధించాలనే తపన మీకే స్వంతం కావాలని మంత్రి మంత్రి ఆకాంక్షించారు.

5015 మంది ఈ శిక్షణ కోసం పరీక్ష రాస్తే 1172 మంది క్వాలిఫై అయ్యారని వీరికి కోచింగ్ ఇచ్చినట్లు వివరించారు. సిద్ధిపేట జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 333 మంది అర్హత సాధించారని, ఎస్ఐ ఉద్యోగాలకు 199 మంది అర్హత సాధించినట్లు, వీరిలో 342 పురుషులు, 190 స్త్రీలు మొత్తం 532 ఉద్యోగార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి దేహధారుడ్య పరీక్ష అర్హతకు ఎంపికయ్యారని మంత్రి పేర్కొన్నారు. రానున్న ఈ వారం, 10 రోజులు నిజమైన దేహధారుడ్య పరీక్ష ప్రారంభం కానున్న దృష్ట్యా ఆత్మవిశ్వాసంతో పరీక్షలో నెగ్గాలని, అభ్యర్థులందరూ విజయాన్ని సాధిస్తారనే నమ్మకం తనకు ఉన్నదని, ఫిజికల్ టెస్టులో గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు, ఫిజికల్ టెస్ట్ ఉద్యోగార్థులు అందరికీ మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News