Thursday, January 23, 2025

ఓయూ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: విద్యార్థి సంఘాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఓయూ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థిసంఘాల నాయకులు పేర్కొన్నారు. భూముల్లో ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయడం సరికాదని విద్యా సంస్ధలను మరింత బలోపేతం చేయాలని నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ అన్నారు. ఇటీవల తార్నాక డివిజన్ మాణికేశ్వరి నగర్ లో ప్రభుత్వ ఆసుపత్రి కొరకు దీక్ష ఏర్పాటు చేయడం వెనుక ఓయూ భూములను కాజేయాలనే రాజకీయ నాయకుల కుట్ర దాగి ఉందన్నారు. వర్సిటీ అధికారులు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలన్నారు.

వివిధ ప్రాంతాలలో భూముల ఆక్రమంపై నిరంతరం రెక్కి నిర్వహించాలని డిమాండ్ చేశారు. బస్తీలో వంద పడకల ఆసుపత్రి కడితే ఓయూ విద్యార్థులకు ఉపయోగం ఉండదని, యూనివర్సిటీలో ఉన్న హెల్త్ సెంటర్ లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని రకాల పరీక్షలతో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. రోజు భూములు కాపాడుకోవడంలో కాంగ్రేస్ పార్టీ నాయకత్వం విద్యార్ధి లోకానికి అండగా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News