Monday, December 23, 2024

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సత్తుపల్లి డివిజన్ అటవీశాఖ ఆధ్వర్యంలో సత్తుపల్లి అర్బన్ పార్క్ వద్ద నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ముందుగా సత్తుపల్లి డివిజన్ ఫారెస్ట్ పరిధిలోని అడవులలో దొరికే వివిధ అటవీ చెట్ల విత్తనాలను, సంచరించే వన్య ప్రాణుల పోటోలను, అడవుల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, అడవుల అందాల ఫొటోల ప్రదర్శనను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించారు.

సత్తుపల్లి డివిజన్ పరిధిలో ఉత్తమ విధి నిర్వహణ పురస్కారాలు పొందిన ఫారెస్ట్ అధికారులను సన్మానించి ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం, ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చేపట్టిన ఎనిమిది విడుతలు విజయవంతంగా పూర్తి కావడంతో రాష్ట్రంలో ఎటుచూసినా పచ్చదనం పరిఢవిల్లుతుందన్నరు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిఓ మంజుల, ఎంపిపి దొడ్డ హైమావతి శంకర్, మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్, కమిషనర్ కే సుజాత, జిల్లా గ్రంథాలయం అధ్యక్షులు కొత్తూరు ఉమా మహేశ్వర రావు, ఆత్మ డివిజన్ అధ్యక్షులు వాసు వనమా, ఆర్డిఓ సూర్యనారాయణ, తాసిల్దార్ శ్రీనివాసరావు, రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వరావు, పట్టణ కౌన్సెలర్లు చాంద్ పాషా, అద్దంకి అనిల్, రఘు, నాగుల, కంటే నాగలక్ష్మి, మట్ట ప్రసాదు, ప్రవీణ్ , మేకల భవాని, మల్లూరి అంకం రాజు, ముస్లిం మైనార్టీ నాయకులు, షేక్ రఫీ, గఫార్, ఆనందరావు, ఫారెస్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News