Monday, December 23, 2024

సిపిఆర్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

- Advertisement -
- Advertisement -

నల్గొండ : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించి తోటి వ్యక్తుల ప్రాణాలను కాపాడి ప్రాణ దాతలు కావాలని అడిషనల్ ఎస్పీ అన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నందు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని డ్రైవర్లు కు సి.పి.ఆర్ మరియు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావు మాట్లాడుతూ రోడ్డు పై వాహనాలు నడిపే క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాహన దారులు ప్రమాదాలు జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించి 108 అంబులెన్స్ కి గాని డయల్ 100 గాని సమాచారం ఇవ్వాలని, సకాలంలో దగ్గరలోని హాస్పటల్ కి తరలించి ప్రాణాలను కాపాడాలని కో రారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులకు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చినప్పుడు ప్రధమ చికిత్స గా ప్రతి వాహన చోదకులు సి.పి.ఆర్ పైన అవగాహన ఉండాలని అన్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సి.పి.ఆర్ పైన మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.

ఈ శిక్షణా ద్వారా అవగాహన పెంచుకొని కనీసం 10 మందికి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి వాహన చోదకులు వాహనాలు నడిపే క్రమంలో రోడ్డు భద్రత పైన అవగాహన ఉండాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పని సరి కలిగి ఉండాలని సూచించారు. ఓవర్ స్పీడ్,హెల్మెట్ లేకుండా ప్రయాణ చేయరాదని,ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం తప్పు అని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సి. ఐ శ్రీను, టి.టి. ఐ ఇంఛార్జి ఆర్. ఐ సంతోష్,జ హంగీర్, హెడ్ కానిస్టేబుల్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News