Thursday, January 23, 2025

పౌర హక్కులపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • పౌర హక్కులకు భంగం కలిగిస్తే శిక్షార్హులు
  • ఎంపిటిసి లింగాల శ్రీనివాస్ ,ఆర్‌ఐ రాజు

అక్కన్నపేట: రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఎంపిటిసి లింగాల శ్రీనివాస్ ,ఆర్‌ఐ రాజు అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండలంలోని రామవరం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు ఉంటాయని, భంగం కలిగించిన వారు ఎంతటి వారైనా సరే శిక్షార్హులవుతారన్నారు. కుల, మత, వర్ణబేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఐక్యమత్యం, సోదరి భావంతో ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిఎం కెసిఆర్ దళిత, గిరిజనులకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పిస్తూ వారి పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు.

అనంతరం ఆర్‌ఐ రాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఐక్యతతో శాంతియుతంగా సమానత్వంతో కలిసి మెలిసి ఉండాలని, విద్యతోనే విలువలు పెరుగుతాయి కాబట్టి పిల్లలకు మెరుగైన విద్య అందేలా తల్లిదండ్రులు బాద్యతలు చేపట్టాలన్నారు. పిల్లల చదువులు మద్యలోనే ఆపివేయకుండా వారిని ప్రోత్సహించి చదివిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పిస్తున్న పౌర హక్కులపై పూర్తి అవగాహన కలుగుతుందని గ్రామస్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ కుమార స్వామి, ఉపసర్పంచ్ శేరి కనకయ్య, వార్డు సభ్యులు బానోత్ బాస్కర్ నాయక్, గ్రామ నాయకులు లింగాల నర్సింలు, పర్శరాములు, యాదగిరి, ప్రశాంత్, వంశీ, వెంకటయ్యలతో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News