Sunday, December 22, 2024

సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి

కీసర: సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ సిబ్బందికి సిపిఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య బృందం డా.రేష్మ, సింధుజ, కుమార్, ముజీర్ ఆకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి సృహ కోల్పోయిన వ్యక్తులకు సిపిఆర్ ఎలా చేయాలనే విషయాన్ని వివరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతున్న దృష్టా ప్రజలందరికీ సిపిఆర్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సిపిఆర్ ప్రక్రియను చేయగలిగితే ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.

గుండెపోటు ద్వారా చనిపోతున్న వారి సంఖ్యను సిపిఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, ఎలిజాల నగేష్ గౌడ్, పి.హరిబాబు, కో ఆప్షన్ సభ్యుల ఆదం షఫీ, అశోక్, మున్సిపల్ మేనేజర్ చంద్రశేఖర్, శానిటరీ ఇన్స్‌ఫెక్టర్ రాంరెడ్డి, హెల్త్ వర్కర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News