యాదాద్రి భువనగిరి : జనాభా పెరుగుదల వలన కలిగే అవసరాలు, అనర్థాలు, సామాజిక అసమానతలు, ఆర్థిక సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు. మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జనాభా పెరుగుదల వ లన కలిగే అవసరాలు, అనర్థాలు, సామాజిక అసమానతలు, ఆర్థిక సమస్యలు, పరిపాలన అ ంశాలు, ప్రకృతి అవసరాలు, మౌలిక వసతుల పై చర్చించి, పై విషయాలతో పాటు జీవన ప్రమాణాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు.
11 జులై 1987 న ప్రపంచ జనా భా 500 కోట్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి సూచన మే రకు అన్ని దేశాలు ప్రతి సంవత్సరం జూలై 11 న ప్రపంచ జనాభా దినంగా పాటిస్తూ, జనాభా నియంత్రణ, పెరుగుదల, సామాజిక, ఆర్థిక, మౌళిక వసతులపై చర్చించి ప్రణాళికలు రచించి, తగు చర్యలు చేపట్టేందుకు ఆయా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గతంలో కుటుంబంలో ఎంత మ ంది పిల్లలు ఉండాలో పెద్ద వారు నిర్ణయించేవారని, ప్రస్తుతం భార్య భర్త సమానమేనని,వారే నిర్ణయించుకోవలన్నారు. కుటుంబ నియంత్రణ ఆడవారికే ఎక్కువగా టుబెక్టమి చేయడం వలన ఆడవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తి జీవిత కాలం ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయంలో మగవారికి అవగాహనా కల్పించి కుటుంబ నియంత్రణ మగవారికి వ్యాసెక్టమికి ప్రోత్సాహించాలని సూచించారు.
ఆడపిల్లపై వివక్ష చూపకూదని,లింగ సమానత్వం పాటించాలన్నారు. జ నాభా పెరుగుదల వలన నిరుద్యోగం, తక్కువ వేతనానికి పని చేయవలసి వస్తుందని, మహిళల ఎదుగుదల ఉండాలంటే చిన్న కుటుంబం ఉండాలన్నారు. జనాభా పెరుగుదలకు ప్రధాన కారణా లు నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం, కానుపుకు కానుపుకు మధ్య ఎడం లేకపోవడం, మగపిల్లలకోసం ఎదురుచూడడం వంటి కారణాల వలన జనాభా పెరుగుదల జరుగుతున్నదన్నారు. 11 జులై 2023 ప్రపంచ జనాభా దినోత్సవా న్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్నీ గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలలో జనాభా పెరుగుదలపై ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అ ంగన్వాడీ కార్యకర్తలు, అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణ, సంక్షేమ పద్ధతులపై అవగాహన, ఆలోచన కల్పించేందుకు కృ షి చేయాలన్నారు.
ముఖ్యంగా వివాహ వయస్సు, బిడ్డకు బిడ్డకు మ ధ్య ఎడం, కుటుంబ నియంత్రణలో మగవారి భాగస్వామ్యం గు రించి అవగాహన కల్పించాలన్నారు. తాత్కాలిక కుటుంబ నియంత్ర ణ పద్ధతులైన ఐ.యు.సి.డి, పి.పి. ఐ.యు.సి.డి. వేసేలా తగిన చ ర్యలు చూడాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.మల్లికార్జున రావు మాట్లాడుతూ,మన దేశంలో ఒక చదరపు కిలోమీటరు పరిధిలో 464 మంది నివశిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఒక బిడ్డ తరువాత శాశ్వత కుటుంబ నియంత్రణ పద్దతి, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన దంపతులకు నగదు, ప్రశంసా పత్రాలతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం జరిగింది. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వై ద్యాధికారులు, వైద్య సిబ్బందికి మెమొంటోలు, ప్రశంసా పత్రాలతో సత్కారం జరిగింది. కార్యక్రమంలో ‘స్వాతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా కుటుంబ నియంత్రణను సంతోషకరమైన ఎంపిక గా మారుద్దాం‘ అనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి నుండి జగదేవపూర్ చౌరస్తా వరకు ప్లే కార్డ్స్, బ్యానర్లు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య & ఆరోగ్య శాఖాధికారి డా. యశోద, ప్రోగ్రాం అధికారులు డా. పరిపూర్ణ చారి, డా. పాపారావు, డా. వినోద్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.