Friday, December 20, 2024

కంటి చూపు విషయంలో ప్రతి ఒకరు జాగ్రత్తలు పాటించాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  కంటి చూపు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంచి జీవన పద్ధతులను పాటిస్తూ మధుమేహం లాంటి వ్యాధుల భారిన పడకుండా, పడినా వైద్యుల సలహా పాటిస్తూ కంటి చూపును కాపాడుకోవాలని త్రిపుర రాష్ట్ర చీఫ్ విప్ కళ్యాణి రాయ్ అన్నారు. ఈ సంవత్సరపు ప్రపంచ కంటి చూపు దినోత్సవ థీమ్ లవ్ యువర్ ఐస్ ఎట్ వర్క్ ప్రకారం కంప్యూటర్ల ముందు ఎక్కువ కాలం గడిపే వారు తగిన రీతిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి చూపుకు ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శుక్రవారం ప్రపంచ కంటి చూపు దినోత్సవంగా సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వ్యాధి నిర్దారణ శిభిరానికి హాజరై ప్రసంగించారు.

అనంతరం విరంచి ఆసుపత్రి వైస్ చైర్మన్ వేదుల సత్యన్నారాయణ మాట్లాడుతూ విరించి ఆసుపత్రిలో ఉన్న కంటి వైద్య కేంద్రం లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కంటి చూపు వ్యక్తి మనుగడకు ఎంతో ఆవశ్యకమని అలాంటి కంటిలో ఎలాంటి సమస్య తలెత్తినా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. కంటి వ్యాధులపై డా. అసద్ సబేరీ, డా. నాజియా కౌసర్, డా. అనామికా జోషిలు పలు అంశాలను వివరించారు. అవసరమైన వారికి కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువగా పని చేసే వారు 20/20/20 నియమాన్ని తప్పని సరిగా పాటించాలని వారు సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News