మనతెలంగాణ/ హైదరాబాద్ : కరోనా, ఒమీక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, జనాలు గుమికూడే ప్రదేశాలకు వెళ్లకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ఆ భగవంతుని చల్లని చూపులు తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పటికీ ఉండాలని, అందరూ సుఖ, సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నారు.
మంత్రికి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు
ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముచ్చింతల్ దివ్యసాకేతంలో పూజలో మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొని త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే సహస్రాబ్ది సమారోహంలో పాల్గొనాలని మంత్రిని జీయర్‌స్వామి ఆహ్వానించారు. కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు ఉన్నారు.