Sunday, January 19, 2025

ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఉండవల్లి: ఉండవల్లి మండల పరిధిలోని కంచుపాడు గ్రామంలో 18 సంవత్సరాల వయసు నిండినవారు ఓటర్ నమోదు చేసుకోవచ్చని, పేరు మార్చుకోవాలనుకున్న కూడా మార్చుకోవచ్చని, గ్రామానికి బిఎల్‌ఓగా వచ్చిన ఆఫీసర్ జ్యోతిక గ్రామ పంచాయతీ ఆఫీసులో అప్లికేషన్ నింపి ఇవ్వచ్చని తెలిపారు.

అంతేకాకుండా ఓటర్ లిస్టులో పేరు నమోదుకి 17 సంవత్సరాలు వయసున్న వారు కూడా నమోదు చేసుకోవచ్చని ఇప్పుడు కాకున్నా మరి ఇతర ఎన్నికలకు ఉపయోగపడతాయని , నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 17 సంవత్సరాలు నిండిన గ్రామంలోని ప్రజలు , యువకులు తప్పనిసరిగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మన గ్రామంలో తెలియని వారికి కంపల్సరీ బాధ్యతగా తెలియపర్చి మన గ్రామంలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News