Monday, December 23, 2024

అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహాకారం అందించాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: జిల్లా అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహాకారం అందించాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్లో 1,7,2,4వ స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన 1వ స్థాయి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యుత్ వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పని చేయకుండా బిల్లులు డ్రా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్థికం, పనులు, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్యంపై పలువరురు సభ్యులు ఆయా శాఖల పనులపై ప్రశ్నించారు.

మూడవ స్థాయి సంఘ సమావేశం వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఐదవ స్థాయి సంఘ సమావేశం చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణ, ఆరవ స్థాయి సంఘ సమావేశం సమావేశం మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ జి. కాంతమ్మ, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News