Thursday, January 23, 2025

బాల కార్మిక వ్యవస్థ నిర్మూళనకు ప్రతిఒక్కరూ సహకరించాలి

- Advertisement -
- Advertisement -
  • బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి
  • మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని

మెదక్: బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని అన్నారు. మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో నేటి నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ ముస్కాన్ -IX పోలీసు బృందం, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పి పోలీసు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ…. బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అన్ని ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేసి వెట్టిచాకిరి నుంచి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని అన్నారు. 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన కాపరులుగా, కిరాణం షాపుల్లో, మెకానిక్ షాపుల్లో, హోటల్‌ల్లో పనిచేస్తూ, వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై బిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి వారి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్‌కు పంపించడం జరుగుతుందన్నారు.

వెట్టిచాకిరి చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. బాల కార్మికులుగా పట్టుకున్న పిల్లలను స్టేట్ హోమ్‌కు పంపించే ముందు జిల్లా మెడికల్ అదికారులతో వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరు కలిసి సమష్టిగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. బాలలను చూసినప్పుడు శారీరకంగా మానసిక, లైంగిక దోపిడీకి గురవుతున్న బాల కార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీది బాలలను చూసినప్పుడు, 1098 లేదా 100, 112కు సమాచారం అందించాలని సూచించారు.

సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాదాకిషన్, శ్రీనివాస్ మెదక్ తహశీల్దార్, ఏఎల్‌ఓలు యాదయ్య, సత్యేంద్ర, ప్రసాద్; రాజు, బీడబ్లుఓ బ్రహ్మయ్య, డిఎంఅండ్‌హెచ్‌ఓ ఏఓ డాక్టర్ నవీన్, డిసిపిఓ కరుణశీల, ఎస్‌డబ్లు, డిసిపిడబ్లూ శ్రీనివాసరావు, డీఎడబ్లుడి అండ్ సిడబ్లూ భరత్, డిఈఓ సిడబ్య్లుసి కిరణ్‌కుమార్, ఎస్‌ఐ మల్లయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్, ఐటికోర్ ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News