Sunday, December 22, 2024

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలి

- Advertisement -
- Advertisement -

గద్వాలటౌన్: మున్సిపాలిటీ అభివృద్ధ్ది చేసేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని మేళచెర్వురోడ్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్‌లు పాల్గొన్ని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవులకు పునర్జీవనం పోయడం కోసం సిఎం కెసిఆర్ ఆరోగ్యవంతమైన తెలంగాణ మార్చాలనే ఉద్దేశంతో హరితహారం కారక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామాల్లో వార్డులో రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలను నాటాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమీషనర్ నరసింహ్మ, అధికారులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News