Monday, December 23, 2024

ప్రతి ఒక్కరు రోజు యోగా చేయాలి

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: మానవుని యొక్క మనస్సు, శరీరం, మరియు తన ఆత్మను ఓకే చోటుకు చేర్చడానికే ప్రయత్నించే ప్రక్రియా యోగా. ప్రతి ఒక్కరు రోజు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సాగర్ రహాదారీ మన్నేగూడ జేఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ అసోషియోషన్, విఎన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దాదాపు 30 పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా ట్రైనర్ నర్సింగ్ గోయల్ విద్యార్దులకు అద్భుతంగా యోగా నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించారు. యోగా అనేది శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా సాదనను సాధించడానికి పురాతన మార్గమన్నారు. ప్రతి ఓక్కరు రోజు యోగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా డిసిసిబి వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, వంగేటి లకా్ష్మరెడ్డి, మాజీ సర్పంచ్ కందాడ లకా్ష్మరెడ్డి, ప్రభుత్వంచే గుర్తింపు పోందిన ప్రైవేట్ పాఠశాలల జిల్లా కోషాధికారి మీనందర్‌రావు, అబ్దుల్లాపూర్‌మెట్ మండల ఆధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఛైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News