సూర్యాపేట:ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్క రు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ.వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జయశంకర్ సార్ చిత్ర పటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొ.జయశంకర్ 89వ జయంతి వేడుకలు పురస్కరించుకుని వారి యొక్క సేవలను కొనియాడారు.
తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి అని, తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త అని, ఉద్యమ స్పూర్తిని సేవలను కొనియాడారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణ మనకు సిద్ధించిందని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్‌డిఓ పిడి కిరణ్‌కుమార్, సిపిఓ వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ రామారావు నాయక్, డిపిఓ యాదయ్య, డిటిడిఓ శంకర్, దయానంద రాణి, టిఎన్జీఓస్ శ్యాం, పశ సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, డిఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.