Thursday, January 23, 2025

బసవేశ్వరుడి సూచించిన మార్గంలో అందరూ నడుచుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి

షాబాద్ : సమాజంలో కుల వ్యవస్థను వర్ణబేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి ఒక బసవేశ్వరుడని జహీరాబాద్ ఎంపిపి బిబి పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ విఫ్ అరికపూరి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బసవేశ్వరుని విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బిసి కమిషన్ మెంబర్ శుభప్రద్‌పటేల్, బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, జడ్పిటిసి పట్నం అవినాష్‌రెడ్డిలు హాజరై బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు అభినవ మండపం ఏర్పాటు చేసి స్త్రీలు, పురుషులకు సమాన హక్కులను కల్పించేందుకు కృషి చేశాడని అన్నారు. అనాడే హరిజనులకు ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారన్నారు. అలాంటి మహనీయుడు సూచించిన మార్గంలోనే అందరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హకీ చైర్మన్ కొండ విజయ్‌కుమార్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూధన్‌రెడ్డి, మాజీ ఎంపిపి పట్నంశెట్టి జ్యోతి రవికుమార్, సంఘం సభ్యులు లింగప్ప, శ్రీకరప్ప, మల్లిఖార్జున్, ప్రదీప్, నవీన్, బస్వరాజ్, శేఖర్, సంతోష్, సందీప్, రవి, విశ్వనాథ్, రమేష్, దీపక్, సర్వేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News