Monday, January 20, 2025

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ జయ ంతి సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పా టిల్,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్,తెలంగాణ సాహిత్య అ కాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్,అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ స ందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆ యన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణా ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని, తెలంగాణా ఉద్య మ సిద్ధాంత కర్త అని ఉద్యమ స్ఫూర్తిని, సేవలను కొనియాడారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ మనకు సిద్ధించిందని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు తూచ తప్పకుండా పాటించాలని అన్నారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) జె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తి ప్రధాత అని అన్నారు.

ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయం పాల న కోసం జీవితాంతం పాటు పడ్డారని ఆయన తెలిపారు. సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకాలు ఆవిష్కరణ తెలంగాణ సాహిత్యా న్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి సాహిత్య అకాడమీ కృషి చే స్తుంది అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన డా.దామెర రాములు రచి ంచిన ‘నేను సావిత్రిబాయి పూలే మాట్లాడుతున్నాను, వన పట్ల సుబ్బయ్య రచించిన బహుజన బా వు టా దీర్ఘ కావ్యం‘ అనే రెండు పుస్తకాలను అదనపు కలెక్టర్ల తో కల సి ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బి.సి.అభివృద్ధి సం క్షే మ అధికారి ఖాజా నజీం అలీ ఆప్సర్,బి.సి.స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. వి జయ్ కుమార్,కలెక్టరేట్ పరిపాలన అధికారి మోతీలాల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News