Saturday, November 23, 2024

పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి

- Advertisement -
- Advertisement -

కూసుమంచి: పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కందాళ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.

అనంతరం పాలేరు గ్రామంలోని బివి.రెడ్డి పంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. అనంతరం పోచారం గ్రామంలో గంగమ్మ తల్లి దేవాలయ, విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎంపిపి బానోత్ శ్రీనివాస్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా, రామ సహాయం బాలకృష్ణా రెడ్డి వివిధ శాఖల అధికారులు, బిఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News