Wednesday, January 22, 2025

ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను చేయాలి

- Advertisement -
- Advertisement -

బోధన్ రూరల్ : సాలురా మండలం తగ్గెల్లె గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ లక్ష్మీ చేతుల మీదుగా కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. 18 సంవత్సరాల వయోజనుల నుంచి వయసుకు పరిమితి లేకుండా కంటి పరీక్షలను చేయడం జరుగుతుందని తెలిపారు.

కంటి పరీక్షల శిబిరంలో అన్ని సదుపాయాలను సమకూర్చడం జరిగిందని పేర్కొన్నారు. కంటి సమస్యలు ఉన్న వారికి అద్దాలు, మాత్రలను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గ్రామ పెద్దలు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News