Sunday, December 22, 2024

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటు పడాలి

- Advertisement -
- Advertisement -
  • చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రీమినల్ కేసులు నమోదు: సిపి శ్వేత

సిద్దిపేట: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటు పడాలని సిపి శ్వేత అన్నారు. శుక్రవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో నేటి నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణపై చైల్డ్ వెల్పేర్ కమిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్, ఎడ్యూకేషన్ డిపార్ట్‌మెంట్, చైల్డ్ ప్రోటెక్షన్ డిపార్ట్‌మెంట్, హెల్త్ డిపార్ట్‌మెంట్ వివిధ డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హాట్ స్పాట్స్‌పై నిఘ ఉంచాలన్నారు. గతంలో రిస్కూ చేసిన పిల్లల యొక్క పరిస్ధితి గురించి అడిగి తెలుసుకోవాలన్నారు. 18 సంవత్సరాల లోపు బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెలు, పశువుల కాపరులుగా , కిరాణం షాపుల్లో, మెకానిక్ షాపుల్లో, హోటళ్లలో పని చేస్తూ పిల్లలు రోడ్డుపై బిక్షాటన చేస్తున్న ఇటుక బట్టీల్లో పౌల్ట్రీ ఫామ్‌లలో, మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన వదిలేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోమ్‌కు పంపించడం జరుగుతుందన్నారు.

చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన, వెట్టి చాకిరి చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా బాలకార్మిక వ్యవస్ధను నిర్మూలించడానికి ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్‌ఐ, నలుగురు సిబ్బందిన నియమించడం జరుగుతుందన్నారు. వివిధ డిపార్ట్ మెంట్ అధికారులు అందరు కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. బాలకార్మికులు లేకుండా సమష్టిగా కృషి చేద్దామని వారికి కావల్సిన అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

జిల్లాలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న లేక వారితో బలవంతంగా పని చేయించిన బంటరిగా బాధపడుతున్న బాలలను చూసినప్పుడు ఆశ్రయం అవసరమైన బాలలను తప్పిపోయిన ,వదిలివేయబడిన బాలలను చూసినప్పుడు, శారీరకంగా, మానసిక, లైంగిక దోపిడీకి గురవుతున్న బాలలను ఆర్థికంగా దోపిడీకి గురువుతున్న బాలకార్మికులను చూసినప్పుడు హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు ,1098 లేదా డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 8712667100 , ఉమెన్ సేప్టి వింగ్ హైదరాబాద్ 9440700906 పోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిసిపిఓ రాము, సిడబ్లూసి చైర్మన్ రాజలింగం, మెంబర్ బాలచందర్, లేబర్ డిపార్ట్‌మెంట్ మహిళా పోలీస్ ఇన్స్‌పెక్టర్ దుర్గ, ఎస్బి ఇన్స్‌పెక్టర్ రఘుపతిరెడ్డి, దుబ్బాక సిఐ కృష్ణ, బాల రక్షభవన్ కో ఆర్డీనేటర్ మమత, చేర్యాల ఎస్‌ఐ బాస్కర్ రెడ్డి, ఎస్‌ఐ శంకర్, ఎస్‌ఐ సాంబయ్య, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్, షీటీం ఆపరేషన్ ముస్కాన్ సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ డిపార్ట్‌మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News