Saturday, November 16, 2024

ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సింగరేణి ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని అన్ని గనులలో, అపార్ట్‌మెంట్‌లలో ఈ నెల 16 నుండి 30 వరకు జరుపుకోవాలని అన్నారు. జిఎం కార్యాలయంలో జరిగిన స్వచ్ఛతా పక్వాడా ప్రతిజ్ఞకు ముఖ్య అతిధిగా ఏరియా జనరల్ మేనేజర్ బళ్ళారి శ్రీనివాసరావు విచ్చేశారు. ప్రతిజ్ఞ అనంతరం అధికారులను, సిబ్బందిని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలని, తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఇతరులకు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చెప్పాలని, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి నిషేదించాలని అన్నారు.

అనంతరం ఏరియా అధికారులు స్వచ్చతా పక్వాడా కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని గనులపైన, డిపార్ట్‌మెంట్‌లపై పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతి ఒక్కరిలో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టూ జిఎం బండి వెంకటయ్య, ఏజిఎం రామలింగం, డిజిఎం(పర్సనల్) అజ్మీరా తుకారాం, డిజిఎం(సివిల్) రవికుమార్, డిప్యూటీ సిఎంఓ డాక్టర్ పద్మజ, ఎన్విరాన్‌మెంట్ అధికారి కృష్ణ ప్రసాద్, ఫైనాన్స్ మేనేజర్ సురేష్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News