Tuesday, November 5, 2024

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి అందరూ తెలుసుకోవాలి

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఓటింగ్ యంత్రాల గురించి ప్రతి ఒక్కరు స్పష్టమైన అవగాహనను కలిగిఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి. కర్ణన్ తెలిపారు.

సోమవారం హుజురాబాద్ మండలం రాజపల్లె గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవిఎం మొబైల్ వాహనాన్ని హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవిఎం డిమాన్షేషన్ కేంద్రాలను పరిశీలించి ఓటు గురించి తెలుసుకోవడానికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారానే ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని, ఈ యంత్రాలు కేవలం క్యాలిక్యూలేటర్‌తో సమానమైనవేనని, వీటిని వైఫై, బ్లూటూత్ ద్వారా ఆపరేట్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో హరిసింగ్, హుజురాబాద్ తహశీల్దార్ కోమల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News