Monday, January 20, 2025

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి అందరూ తెలుసుకోవాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడంతోపాటు ఓటింగ్ యంత్రాల గు రించి ప్రతి ఒక్కరు స్పష్టమైన అవగాహనను కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో నవజీవన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈవియం మొబైల్ వాహనాన్ని ప రిశీలించి, బిఎల్‌ఓలు, ఓటు గురించి తెలుసుకోవడానికి వచ్చినవారితో కలెక్టర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారానే ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోనే ప్రజలకు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిపాట్‌ల గురించి ప్రత్యక్షంగా తెలియజేయడానికి ప్రతి నియోజకవర్గానికి మొబైల్ వాహనాలతో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వీటిని సందర్శించి ఓటింగ్, ఓటింగ్ పరికరాలను గురించి తెలుసుకోవాలని తెలిపారు.

పచ్చదనం, పారిశుద్దంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మండలంలోని పొట్లపల్లి గ్రామంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిబ్బంది పారిశుద్దంపై అలసత్వం వహించవద్దని, ఆయన సూచించారు. మొక్కలను గ్రామంలోని ప్రతి ఇంటికి అందజేయాలని ఆయన అన్నారు. ఆయనవెంట ఎంపిడివో గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపిఓ వీరారెడ్డి, సిబ్బంది ఉన్నారు.

ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్..
మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసారు. ఆసపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలు, ఆసుపత్రిలో వారికి అందిస్తున్న డైట్ గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డెలివరీ చేసుకున్న గర్భిణీల కు కెసిఆర్ కిట్‌ల పంపిణీ గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డెలివరీ చేసుకున్న గర్భిణీలకు కెసిఆర్ కిట్‌ల పంపిణీ, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్‌ల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణ పరిశీలించి పారిశుద్దం నిర్వహణ పకడ్భంధీగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమ ంలో మిర్యాలగూడ ఆర్డీవో బి. చెన్నయ్య, ఎమ్మార్వో అనిల్‌కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్, సమరద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News