Monday, December 23, 2024

వాస్తవాలు అందరికీ తెలియాలి : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అందరికీ వాస్తవాలు ముందుంచాలనే లక్ష్యంతో రజాకార్ సినిమా తీసినందుకు అభినందనలు అని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ జలవిహార్‌లో ‘రజాకార్’ సినిమా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినంక పాతబస్తీ ఫైల్స్ తీయాలని గూడూరు నారాయణరెడ్డికి సూచించిన అదే సమయంలో రజాకార్ సినిమాను తీయాలన నిర్ణయించారు.

దేశంలో 40 ఏళ్ల లోపు వారి  70 శాతం జనాభా ఉంది. వారికి రజాకార్ పాలన ఎట్లుందో తెల్వదు.. కొందరు కావాలనే ఉస్మానియా, చార్మినార్ లను చూపించి నిజాం పాలనను గొప్పగా చిత్రీకరించే యత్నం చేశారు. నిజాం నరరూప రాక్షసుడు అన్నారు. నాటి ఉద్యమ చరిత్రతోపాటు నేటి తెలంగాణ ఉద్యమాన్ని కూడా తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందన్నారు. రజాకార్ సినిమాతో నిజమైన చరిత్రను చూపెట్టే యత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా “రజాకార్‌” సినిమాను విస్త్రత ప్రచారం చేసి ప్రజలు చూసేలా చేయాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి నేతలు సిహెచ్ విద్యాసాగర్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, విఠల్, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Razakar1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News