Wednesday, January 22, 2025

పర్యావరణం, అడవుల ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలి

- Advertisement -
- Advertisement -

నుమాయిష్ లో అటవీశాఖ స్టాల్ ప్రారంభిస్తూ ఆర్.ఎం. డోబ్రియాల్ వ్యాఖ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రతీ ఒక్కరూ అడవులు, పర్యావరణం ప్రాధాన్యత తెలుసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. తెలంగాణ అటవీ శాఖ స్టాల్‌ను శుక్రవారం నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా అడవుల ప్రాముఖ్యతను తెలుపుతూ అటవీ శాఖ చేపట్టిన పనులను అందరికీ అర్థమయ్యే రీతిలో స్టాల్ ను ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించే పర్యాటకులు, పిల్లలు, పెద్దలు అడవుల ప్రాధాన్యతను తెలుసుకునే విధంగా డిస్ ప్లేను అటవీశాఖ ఏర్పాటు చేసింది.

ఇంకా ఔషధ మొక్కల స్టాల్, హస్తకళలు, ప్రత్యేకంగా పిల్లల కోసం మినీ జూ కూడా ఏర్పాటైంది. ఫారెస్ట్ యుటిలైజేషన్ ఆఫీసర్ డివి . రెడ్డి అటవీ శాఖ స్టాల్ ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పిసిసిఎఫ్ (ఎస్‌ఎఫ్) సువర్ణ, చీఫ్ కన్జర్వేటర్ (ఆర్ అండ్ డి, ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ సైదులు, డిఎఫ్‌ఓ ఎం.జోజి, ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News