బాలల దీనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై
వీ కాప్ కార్యక్రమం
ట్రాఫిక్‌పై అవగాహన కల్పించిన పోలీసులు
పాల్గొన్న 45 పాఠశాలల విధ్యార్థులు
ప్రారంభించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నగర ట్రాఫిక్ పోలీసులు, హెచ్‌సిఎస్‌సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీ కాప్ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, వసుంధర సిన్హా, ఇన్‌కం ట్యాక్స్, డైరెక్టర్ జనరల్ ఇన్‌వెస్టిగేషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర సిపి అంజనీకుమార్ మాట్లాడుతూ విద్యార్థులే కాకుండా వారి ద్వారా వారి తల్లిదండ్రులు ట్రాఫిక్‌పై అవగాహన పెంచుకోవాలని కోరారు. బాలలదినోత్సవం సందర్భంగా బాలలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు వారితో వివిధ పాత్రలు చేయించామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విధ్యార్థులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మెమోంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో ఇన్‌కంట్యాక్స్ డైరెక్టర్ జనరల్ ఇన్వెస్టిగేషన్ వసుంధర సిన్హా, అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, డిసిపి ఎల్‌ఎస్ చౌహాన్ తదితరులు మాట్లాడారు. నగరంలోని 45 పాఠశాలలకు చెందిన 10,000 మంది విధ్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్‌మెంట్ తదితరులు పాల్గొన్నారు. నగర అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, ట్రాఫిక్ డిసిపి ఎల్‌ఎస్ చౌహాన్, హెచ్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ అవినాష్ చుక్కపల్లి, ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ పియూష్ అగర్వాల్, హెచ్‌సిఎస్‌సి అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్, సైబర్ ఫోరం జాయింట్ సెక్రటరీ సంతోష్ కావేటి, ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రటరీ గీత గోటి తదితరులు పాల్గొన్నారు.