Thursday, January 23, 2025

భూదానం స్కీమ్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : కూకట్‌పల్లి సర్కిల్ హైదర్‌నగర్ డివిజన్‌లోని నిజాంపేట్‌లోగల సెవెన్ హిల్సలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఏర్పాటు చేసిన భూదానం స్కీమ్‌ల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. శనివారం దేవస్ధానంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గాంధీ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో భూదానం స్కీమ్ కరపత్రాలను ఆవీష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం సమీపంలో ఉన్న 227 గజాల స్ధలాన్ని కొనుగోలు చేసేందుకు కమిటీ సభ్యులు భూదానం స్కీం పేరుతో ప్రతీ ఒక్కరిని స్వామి కా ర్యంలో పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. గజం లక్ష రూపాయలు కావడంతో భక్తులు, స్ధానికులు , పెద్దలు తలా ఓ చేయ్యివేసి విరాళం అందిస్తే కొనుగోలు చేయడం సునాయసమవుతుందని, కమిటీ సభ్యులు తీసుకువచ్చిన మంచికార్యం దేవుని కృపతో తప్పక విజయవంతమవుతుందని గాంధీ తెలిపారు.

అనంతరం తన వంతు విరాళంగా లక్ష రూపాయలను గాంధీ ప్రకటించిగ, అదే సమావేశానికి హాజరైన పలువురు భక్తులు ముందుకువచ్చి మరో 26లక్షల ప్రకటించి గాంధీ చేతుల మీదుగా మొత్తం 27 లక్షల రూపాయల విరాళాన్ని సేకరించి కమిటీ స భ్యులకు అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఈఒ సత్య చంద్రారెడ్డి, ఆలయ చైర్మన్ కె.ఆర్.కె. రాజు, కమిటీ సభ్యులు శ్రీనివాస్, శ్రీహరి, కిరణ్, అప్పిరెడ్డి, కుమార్‌స్వామి, లక్ష్మీ, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ గౌరవాధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ మహిళ నేత పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News