Wednesday, January 15, 2025

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల్వాలి

- Advertisement -
- Advertisement -

నర్వ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని ప్రజలను ప్రజా ప్రతినిధులను అధికారులను ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. నాటే ప్రతి మొక్క పెద్దగా రెండు మీటర్‌లు తగ్గకుండా ఉండాలన్నారు. గురువారం నర్వ మండలం పర్యటనలో భాగంగా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్‌తో కలిసి పర్యటించిన జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. పథర్చేడ్ గ్రామ పచాయతీ పరిధినుంచి ప్రారంభం అయిన నర్వ మండలం నుంచి రహదారికి ఇరువైపులా పెద్ద మొక్కలను నాటాలన్నారు. చెరువు కట్టలపై పూల, పండ్ల, నీడను ఇచ్చే మ్కొలను నాటాలన్నారు. అనంతరం పథర్చేడ్ గ్రామ పంచాయతీలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతి గదిలోని విద్యార్థులతో మమేకమై విద్యార్థులకు విద్యార్థుల సామర్థం అభివృద్ధి పర్చుటకు వెలుగు అభ్యాసమిత్ర 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక 2023/24 బేస్‌లైన్ టెస్ట్ నిర్వహణను సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించబడుతున్న బేస్ లైన్ టెస్ట్ గురించి అక్కడ ఉన్న విద్యార్థులను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. 45 రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యార్థులకు వారికి అర్థం అయ్యే విధంగా బోదించాలన్నారు. బేస్ లైన్ టెస్ట్ విద్యార్థుల అభ్యాసన సామర్థన అంచనా వేసి వారి సామర్థాల వారిగా విభజించి వర్క్ బుక్ ద్వారా విద్యార్థులకు నేర్పించాలని తెలియజేశారు. అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ చేసి సమయానికి కోడీగుడ్లు అందుతున్నాయని, పిల్లలకు బాలమృతం అందిస్తున్నారు. లేదా అనే విషయాన్ని కనుకున్నారు. కస్తూర్భా పాఠశాలలో కిచెన్ రూంను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News