Sunday, December 22, 2024

స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. గురువారం స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో భాగంగా సిద్దిపేట పట్టణంలో ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి నడుస్తూ చెత్త వేరడం అనే కార్యక్రమంలో పాల్గొని ఓపెన్ ప్లాట్‌లలో చెత్తను సేకరించి వేరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓపెన్ ప్లాట్లలలో చెత్తను వేసే వారిని చుట్టు ప్రక్కల ఉన్నటువంటి వారు గమనించి మందలించాలన్నారు. పట్టణంలోని ప్రజలందరు చెత్తను కేవలం మున్సిపల్ వాహానాలకు మాత్రమే అందించాలన్నారు.

ఓపెన్ ప్లాట్‌లలో చెత్త వేస్తే దోమలు, ఈగల ద్వారా ప్రజలు ఆనారోగ్యాలకు గురవుతారన్నారు. ప్రజలలో చాలా వరకు మార్పు రావడం జరిగిందని కొంత శాతం మందిలో మార్పు రావడం లేదన్నారు. ప్రజలు అధికారులందరికి సహకరించాలన్నారు. వార్డులు బాగుంటే పట్టణం అందంగా కనిపిస్తుందన్నారు. సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం ఆలోచించే గోప్ప నాయకుడు మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలు తప్పకుండా చెత్తను తడి, పొడి , హానికరమైన చెత్తగా వేరు చేసి కే వలం మున్సిపల్ వాహానాలకు మాత్రమే అందించాలన్నారు. ఆరుబయట చెత్త వేసే వారికి జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సేకరించినటువంటి చెత్తను మూడు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించారు. వర్షాకాలం కావున పొడిచెత్తను ఎవరు కూడా ఆరుబయట వర్షం పడే చోట పెట్టకూడదన్నారు. వార్డులోని గల్లీలు కలియతిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, వార్డు కౌన్సిలర్లు బింగి బాల్ లక్ష్మి రాజేశం, సాయన్నగారి సుందర్, రాపెల్లి విఠోభ, తాడురి సాయి ఈశ్వర్ గౌడ్, ఎడ్ల ఆరవింద్ రెడ్డి, నాయకం ల క్ష్మణ్, రెడ్డి విజయేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు బందారం రాజు, శ్రీనివాస్ యాదవ్, పట్టణ బీఆర్‌ఎస్ టౌన్ యూత్ అద్యక్షుడు రెడ్డి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ సానిటరి ఇన్స్‌పెక్టర్లు , మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News