Tuesday, January 21, 2025

ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లి పట్టణానికి అద్దం మంజూర్‌నగర్‌లో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పనుల పురోగతిపై భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు భూపాలపల్లి పట్టణ ప్రముఖులతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో వైభవేతంగా నిర్మిస్తున్నటువంటి ఆలయానికి జిల్లా నలుమూలల నుండి దాతలు విరివిగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అందేలా చేయాలన్నారు. అనంతరం ఆలయన కమిటీ, పట్టణ కలిసి ఆలయ పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఆలయ కమిటీ సభ్యులు శిల్ప అనిల్, సంజనపు స్వామి, కౌన్సిలర్ సిమెంట్‌షాప్ రవీందర్, బాలాజి ఆసుపత్రి శ్రీను, కుమారస్వామి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News