Saturday, November 23, 2024

దశాబ్ది ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలి

- Advertisement -
- Advertisement -
  • ఈ ఉత్సవాలను పండుగ వాతావరణంగా జరుపుకోవాలి
  • ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి

నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 21రోజులపాటు జరిగే దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు అయి విజయవంతం చేయాలని, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిలు అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని, బివి రాజు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి, ముఖ్య అతిథులుగా హాజరై, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులు, ఆయా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను, పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని అన్నారు.

ఈ ఉత్సవాలకు జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, భాగస్వాములు కావాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామగ్రామాన జెండా ఆవిష్కరణలు, రైతు వేదికలను, మున్సిపల్ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, చెరువు కట్టలపై, ఈ ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాలకు వేయి మందికి పైగా హాజరై ,ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు, శాఖల వారీగా అన్ని రంగాలలో అభివృద్ధి పనులను గుర్తించి, పనుల తీరుపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవార్డ్స్ ఇవ్వ డం జరుగుతుందన్నారు. లేబర్ బోర్డ్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ చై ర్మన్ చంద్ర గౌడ్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మ న్సూర్ , ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, ఆయా మండలాల జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, స ర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News