Monday, January 20, 2025

సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : సామాజిక సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ అన్నారు. విబిజి వ్యవస్థాపకులు మడిపడిగె రాజు జన్మదినం సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పేద మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు వీల్ చైర్స్, జైపూర్ లెగ్స్, స్కూల్ పి ల్లలకు స్కాలర్‌షిప్స్, నోట్‌బుక్స్, పేద మహిళ లకు చీరలు, నిరు పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు రక్తదానం, అవయవదానం చేశారు. ము ఖ్య అతిథిగా సంపత్ కుమార్ హాజరై మాట్లాడారు. పుట్టినరోజు సందర్భం గా పార్టీల పేరుతో వేడుకలను జరిపి డబ్బును వృధా చేయకుండా అవస రమైన వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదుకోవడం అభినందనీయమన్నారు. కార్య క్రమంలో విబిజి ఫౌండేషన్ చైర్మ న్ మడిపడిగ రాము, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ప్ర సాద్, ఇమ్మడి రమేష్, ప బ్బతి రవి, నీల విజయలక్ష్మి, చికోటి సాయి నిఖిత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News