Thursday, January 23, 2025

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : మాజీ మంత్రి గేడం నగేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం స్థానిక ప్రకృతి వనంలో మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు గేడం నగేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నగేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన పకృతి పర్యావరణానికి బాగుంటుందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు ఇంత గొప్ప కార్యక్రమం ఆలోచన చేసిన ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, సర్పంచులు, ఉపసర్పంచులు చైర్మన్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్ డా.రత్నాకర్‌రెడ్డి
ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో బాగంగా పుట్టిన రోజు సందర్బంగా హెటిరో డైరెక్టర్ డా.రత్నాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్‌కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.యోగేశ్వర్ రెడ్డి, కొనుకటి రమేష్ రెడ్డి, డా.మురళి, డా.ఉత్తమ్ కుమార్ రే, డా.రామచందర్ పురాని, డా.శశిధర్ రెడ్డి , హెచ్.ఆర్ .రాంరెడ్డి , సుధాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News