Saturday, December 21, 2024

ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి : శ్రీకాంత్ రావు

- Advertisement -
- Advertisement -

గ్రీన్‌ఇండియా చాలెంజ్

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపి సంతోష్ పిఎ కె.శ్రీకాంత్ రావు తన  పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రావు మాట్లాడుతూ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొని పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.సురేష్ కుమార్ ,ఆర్.రాజేష్ , జి.అప్పు రెడ్డి, జి.సంతోష్ రెడ్డిలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News