Tuesday, February 11, 2025

17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్బంగా ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కెసిఆర్ సంకల్పానికి మద్దతుగా మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకువచ్చిన వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ ఆఫీస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు పెద్ది సుదర్శన్ రెడ్డి, పార్టీ నాయకులు బిగాల గణేష్, శంకర్ నాయక్,

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ సమక్షంలో కెటిఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కెసిఆర్‌కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని పేర్కొన్నారు. వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను కెటిఆర్ అభినందించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ కోరారు. హరితసేనలోని సభ్యులందరూ మొక్కలు నాటి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News