Thursday, January 23, 2025

‘పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి’

- Advertisement -
- Advertisement -

గ్రీన్‌ఇండియా చాలెంజ్

‘పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి’

 

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో బాగంగా హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్ వైద్యబృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.రవి కిరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ నర్స్ స్వర్ణ, డా.సత్యనారాయణ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొందాం.. హరిత తెలంగాణను సృష్టిద్దాం…

తమ పెళ్లి రోజు సందర్భాన్ని పురస్కరిచుకుని పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలనే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు తెలంగారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యురాలు సుమిత్రానంద్ దంపతులు వేప అల్లనేరెడు మొక్కలు నాటారు. సుమిత్రానంద్ భర్త ఆనంద్ రావు, కుమార్తె మహతి లతో కలిసి మూడు మొక్కలు నాటి లక్షలాది మందిలో ఈ స్పూర్తిని నింపుతూ చైతన్య పరుస్తున్న ఎంపి సంతోష్ కృషికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలిపారు. ‘మొక్కలు నాటే మహా యజ్ఞం లో మేము సైతం‘ అవుతున్నందుకు సంతోషంగా ఉంది …భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి పండ్లు సమృద్ధిగా వానలు ఈ ఉద్యమం ద్వారా అందివస్తాయని ఆశాభావం వ్యక్తమవుతున్నది. అందరం అందరికోసం హరిత తెలంగాణను సృష్టిద్దాం. గీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొందామ’ని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News