Friday, December 20, 2024

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట : ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని హుజురాబాద్ డిప్యూటి డిఎంహెచ్‌ఓ డాక్టర్ చందూలాల్ సూచించారు. శుక్రవారం జమ్మికుంట మండల వావిలాల గ్రామంలో ఏర్పాటుచేసిన పునరావాస (జార్ఖండ్ వలస కూలీలు)బాధితుల కేంద్రంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సనజవేరియా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిభిరాన్ని డిప్యూటి డిఎంహెచ్‌ఓ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో 81మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జంకు ఫుడ్ తీసుకోకుండా, ఆల్కహాల్, కొవ్వు పథార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోషకవిలువలు సంవృద్ధిగా దొరికే పండ్లు, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. శరీర వ్యాయామం చేయడం వల్ల హేపటీస్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు మన నివాసప్రాంతంలో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమలు, ఈగలు వృద్ధిచెంది రోగాలబారీన పడే ప్రమాధం ఉంటుందని అన్నారు. ప్రతీఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వావిలాల సర్పంచ్ జక్కేన శ్రీలత, ఎంపీటీసీ మర్రి మల్లేశం, ఎంపీఓ సతీష్‌రావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్‌రెడ్డి, హెల్త్ ఎడ్యూకేటర్ పబ్బు రవీందర్, సూపర్‌వైజర్లు స్వరూప, సదానందం, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News