Wednesday, January 22, 2025

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

కీసర: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీ పరిధి రాంపల్లి ఓయు కాలనీలోని శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం వార్షికోత్సవ వేడుకలలో మంత్రి పాల్గొన్నారు.

నాగారం మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.మల్లేష్ యాదవ్, పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షులు టి.శ్రీధర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News