Thursday, January 23, 2025

ప్రతిఒక్కరూ యోగా ద్యానం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: యోగా అనేది ఆరోగ్యానికి మంచిదని ప్రతిఒక్కరూ యోగా ద్యానం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం పట్టణ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన యోగా వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యొగా చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండకలుగుతారన్నారు. యోగా ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించ కలుగుతామన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే యోగాను కనీసం ఒక గంట పాటు చేయడంతో ఆరోగ్య సమస్యలు రాకుండా చేసుకోకలుగుతామన్నారు. యొగా అనేది చిన్నతనం నుంచే అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News