Monday, January 20, 2025

ఉచిత వైద్య శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని

ఘట్‌కేసర్: ప్రతిఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోని ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధి కొండాపూర్ కమ్యూనిటీ భవనంలో మంగళవారం మెడిసిటీ హస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని మెడిసిటీ హస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

నేడు కొత్త ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్యం పట్ల నిర్లక్షం చేసే అనారోగ్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయని, ప్రతి ఒక్కరు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు వివిధ వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బర్ల శశికళ, మాజీ ఎంపిటీసి చిలుగూరి గోపాల్ రెడ్డి, నాయకులు బర్ల దేవేందర్, వైద్యులు బిఎన్ రెడ్డి, శోభ, కల్పన, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News