Monday, December 23, 2024

ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి

- Advertisement -
- Advertisement -

బోధన్ : ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని బోధన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మా శరత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బోధన్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎసిపి కిరణ్‌కుమార్ అధ్యక్షతన 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మాశరత్‌రెడ్డి హాజరై విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్‌ఆమేర్ సతీమణి ఆయేషా ఫాతిమా అమేర్, జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ రజితా ఎల్లయ్య యాదవ్‌లతో కలిసి జెండా ఊపి 2కె రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్షంతో సిఎం కెసిఆర్ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.

ఆయేషా ఫాతి మా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఆర్డీ ఓ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆయా గ్రామాలవారు సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం అభినందనీయమన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసి శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసుశాఖకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రజలకు, లయన్స్‌క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రతినిధులకు నాయకులకు ఎసిపి కె.ఎం.కిరణ్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రేంకుమార్ శ్రీనివాస్ రాజు, మున్సిపల్ కమిషన్ ఖమర్ అహమద్, ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, ఎస్‌ఐలు సందీప్, పీటర్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంందర్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు శరత్‌రెడ్డి, దూప్‌సింగ్, పిట్ల సత్యం, శ్రీకాంత్‌గౌడ్, ఆలయాల ఛైర్మన్లు బీర్కూర్ శంకర్, అశోక్‌రెడ్డి, రైసస మాజీ కన్వీనర్లు బుద్దే రాజేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ షకీల్ యువకులు స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News