Monday, December 23, 2024

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలోని పివి నరసింహారావు ఔషధవనంలో మంగళవారం ఎంఎల్‌సి సురభి వాణిదేవి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి హరితహారం కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే పాఠశాల స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పొలాల వద్ద గట్ల వెంబడి రోడ్లకు ఇరువైపులా పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.

చెట్లు లేకపోవడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవడంలేదని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని సూచించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ ఎంపిసి నక్షత్రం జయవంత్, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కార్తీక్ రెడ్డి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News