Friday, November 15, 2024

ప్రతిఒక్కరూ నులి పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్

గద్వాల ప్రతినిధి: ప్రతి ఒక్కరు నులి పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్ అన్నారు. గురువారం జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎస్. శశికళ, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డా. సిద్దప్ప, గద్వాలలోని నల్లకుంట వీధిలో ఉన్న , అంగన్‌వాడీ సెంటర్ , జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలు, 1,68,425 ఉన్నారని వారందరికి ఈ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా అందరికి ఆల్బెండజోల్ టాబ్లెట్‌ని అన్ని అంగన్‌వాడీ సెంటర్లు , ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ , జూనియర్ కాలేజీలలో లోని విద్యార్థులకు, అంగన్‌వాడీ టీచర్లు, స్కూల్ ఉపాద్యాయులు తప్పనిసరిగా మింగించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎస్. శశికళ మాట్లాడుతూ విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే , అటువంటి విద్యార్థులను , అంగన్‌వాడీ టీచర్లు, ఉపాద్యాయులు, ప్రత్యేకంగా గుర్తించి ఎంఒపి అప్ రౌండప్ రోజులలో 4/8/23 నుండి 10/8/23 తేదీల్లో ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ మింగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మహేశ్వరి, సిడిపిఓ హేమలత, డా. మాదుర్య, ఆర్‌బిఎస్ కె. ప్రోగ్రాం వైద్య సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కె. మధుసూదన్‌రెడ్డి, టి. వరలక్ష్మీ, పీపీ. యూనిట్ వైద్య సిబ్బంది పార్వతమ్మ, స్వర్ణలత, సుజాత, అంగన్‌వాడీ టీచర్లు , ఆశలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News