Wednesday, January 22, 2025

సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

 

ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ గ్రామాల నుండి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్ అన్నారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులతో చర్చించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఏజెన్సీకి జిల్లా అస్పత్రి 24 గంటల పాటు, వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఏజెన్సీలోని గిరిజనులకు తెలుగు ఎక్కువగా మాట్లాడరని వారి భాషల్లో మాట్లాడుతారని వారితో మార్యాదపూర్వంగా వ్యవహరించి వైద్యం చేయాలన్నారు. అనంతరం 3వ తేదీన సదరం క్యాంపు నిర్వహణపై ఆరా తీశారు. సదరంకు మీసేవాలో ధరఖాస్తు చేసుకున్న వారు స్లాట్ బుకింగ్ పత్రాలతో పాటుగా తదితర పత్రాలను వెంట తీసుకరావాలని , ఇట్టి సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు డాక్టర్ దీపక్ పుష్కర్,మహేందర్, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News