Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

యాచారం: బిఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని,పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు.

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధేశాల మేరకు యాచారం మండల కేంద్రంలోని సాయిశరణం గార్డెన్‌లో సోమవారం పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మస్కు జనార్థన్, బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన విభాగం నాయకులు కాజుమహ్మద్,మండల యూత్ అధ్యక్షులు సయ్యద్‌జానీ,సీనియర్ నాయకులు చింతుల్ల సాయిలు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి ఎన్నికల పరిశీలకునిగా పాల్గొని కార్యకర్తలకు పలు అంశాలలో దిశానిర్ధే శం చేశారు.

గత కొంత కాలంగా గ్రామంలో ఎమ్మెల్యే మం చిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి గడపకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బర్ల కృష్ణ, జో గు అంజయ్య,రాములు,అంజన్న, విష్ణు, రమేశ్, బర్ల శివ, పవన్, సాయి,సతీష్, మహేష్, నవీన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News